సామజిక సారథి, వెంకటాపూర్: పబ్లిక్ టాయిలెట్స్ పనులను వేగంగా పూర్తి చేయాలని మేడారం జాతరలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అడిషనల్ కలెక్టర్ ఐల త్రిపాటి అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని లక్ష్మీదేవి పేట గ్రామంలో నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్ (కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్) పనులను పరిశీలించిన అనంతరం అధికారులు, గ్రామ సర్పంచ్ కుమారస్వామికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సిసి క్రాంతి, ఎంపీడీవో ఎండి ఎక్బాల్ హుస్సేన్, ఈజీఎస్ఏపీఓ నారగోని సునీత, ఈసి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, పంచాయతీ కార్యదర్శి తడుక రాజు, కారోబార్ గోస్కుల లక్ష్మణ్, గ్రామస్తులు గట్టు శీనువాసు, తండా రమేష్, అలం కుమారస్వామి, గుండె యాదగిరి తదితరులు ఉన్నారు.
- November 25, 2021
- Archive
- లోకల్ న్యూస్
- Additional
- COLLECTOR
- Public
- TOILETS
- VENKATAPUR
- అడిషనల్
- కలెక్టర్
- టాయిలెట్స్
- పబ్లిక్
- వెంకటపూర్
- Comments Off on పబ్లిక్ టాయిలెట్స్ పూర్తి చేయాలి