సారథి న్యూస్, చొప్పదండి: నిరుపేద విద్యార్థినులకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు చెందిన బోస్టన్ స్టడీ గ్రూప్(సంస్థ)వారి సహకారంతో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత శనివారం స్మార్ట్ ఫోన్లు అందజేశారని స్వేరోస్మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జెట్టిపల్లి అనిల్ కుమార్ తెలిపారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్చెప్పిన ఫే బ్యాక్ టు సొసైటీ నినాదాంతో పేద విద్యార్థులకు సేవ చేస్తున్నానని తెలిపారు. కలిగెటి శ్రీయ, చింతల లక్ష్మికి ఫోన్లను ఆన్లైన్క్లాసెస్ కోసం అందజేశానని వివరించారు. కార్యక్రమంలో నూనె సత్యం, కడమంచి కనుకమల్లు, నూనె నర్సయ్య, జెట్టిపెల్లి సూర్య తేజ తదితరులు పాల్గొన్నారు.
- February 6, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AMERICA
- BOASTAN STUDY
- SUREPALLY SUJATHA
- అమెరికా
- బోస్టన్ స్టడీ గ్రూప్
- సూరేపల్లి సుజాత
- Comments Off on విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్ల అందజేత