సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో ఇల్లంతల శ్రీను అనారోగ్యంతో ఇటీవల చనిపోయాడు. వారి కుటుంబానికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయకుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపి తనవంతు సహాయంగా రూ.ఐదువేల నగదు, 50 కిలోల బియ్యం, ఐదు లీటర్ల వంటనూనె అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి లబ్దిపొందే ప్రతి సహాయానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ క్రిష్ణవేణి మధుసూదన్ రెడ్డి, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, సిద్దిరాంరెడ్డి, శ్రీకాంత్, జోగేల్లి రాజు పాల్గొన్నారు.
- May 2, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- NIZAMPET
- RAMAYAMPET
- zptc panja vijay
- జడ్పీటీసీ పంజా విజయ్
- నిజాంపేట
- రామాయంపేట
- Comments Off on ఆర్థిక సహాయం అందజేత