సామాజిక సారథి, తలకొండపల్లి: ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసినట్లు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం తుమ్మలకుంట తండాలో మూడవత్ గోపినాయక్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడన్నారు. బాధిత కుటుంబానికి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ. 5వేల నగదును అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, ఐక్యత ఫౌండేషన్ సభ్యులు నూనె రాఘవేందర్, లక్ష్మణ్, భరత్ రెడ్డి, వార్డు సభ్యులు పీరియాసేవ్ రాయుడు, భరత్, కుమార్, వాసు, వంశీ, సూర్య, తదితరులు పాల్గొన్నారు.
- October 26, 2022
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- aid
- District
- FAMILY
- financial
- grantee
- RANGAREDDY
- TALAKONDAPALLY
- Tummalakunta
- VICTIM
- Comments Off on బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత