Breaking News

ఘనంగా ఎమ్మార్పీఎస్​ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా ఎమ్మార్పీఎస్​ఆవిర్భావ దినోత్సవం

సారథి, వాజేడు: ఎమ్మార్పీఎస్ 27వ ఆవిర్భావ దినోత్సవాన్ని ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు అరికెల వేణు మాదిగ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం అనునిత్యం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తూనే ఉన్నారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, వికలాంగుల పింఛన్ ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దళితులను ఏడేళ్లుగా మోసం చేసిన కేసీఆర్ ఉపఎన్నికల నేపథ్యంలో ముసలి కన్నీరు కారుస్తూ దళితక్రాంతి పథకంతో ప్రలోభపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ గారడీ మాటలు దళితులు నమ్మే పరిస్థితి లేదని హెచ్చరించారు. రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం చూస్తే ఆయనకు వారిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఓట్లను పొందడం కోసమే దళితులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని ఎద్దేవాచేశారు. దళితబిడ్డలు ఇక మోసపోరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు ఆదినారాయణ, మండల ప్రధాన కార్యదర్శి లేగల ప్రవీణ్, ఉపాధ్యక్షుడు పొడపాటి సత్యనారాయణ, తిప్పనపల్లి భాను, ఇల్లెందుల భరత్, ఇల్లందుల చిరంజీవి, బలుసుపాటి నరసింహారావు పాల్గొన్నారు.