Breaking News

నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

నియంతృత్వ విధానాలతోనే సమస్యలు

సామాజిక సారథి, నల్లగొండ: మైనార్టీ ఉద్యగుల సమస్యలు పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేషనల్ కో ఆర్డినేటర్ సయ్యద్ షౌకత్ అలీ ఖాన్ అన్నారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని రెవెన్యూ  గెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నియంతృత్వ విధానాలతో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీలో ఉద్యగులకు, పెన్షనర్లకు ఎలాంటి ప్రయోజన లేదని అన్నారు. అనంతరం ఆ సంఘం జిల్లా కార్యకవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎండీ గులాం రబ్యాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో  ఎంఐఎం జిల్లా మాజీ అధ్యక్షుడు అహ్మద్ కలీం, మెవా నేషనల్ కౌన్సిల్ మెంబర్ షేక్ చాంద్ పాష, మాజీ అధ్యక్షుడు ముబీన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు షకీల్ అహ్మద్, ఎండీ గపూర్, షాహిన్ తదితరులు పాల్గొన్నారు.