Breaking News

సమస్యలు పరిష్కరించాలి

బ

సామాజిక సారథి ,మెదక్ ప్రతినిధి:  ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఎస్పీ చందన దీప్తి అన్నారు. సోమవారం జిల్లా  పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ దినం సందర్భంగా జిల్లా నలుమూలల  నుండి జిల్లా పోలీస్ కార్యాలయానికి 17 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వారితో జిల్లా ఎస్పీ చందన దీప్తి నేరుగా మాట్లాడి వారి సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా  సర్కిల్ ఇన్స్పెక్టర్ లకు, ఎస్ఐలకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలం మాడాపూర్ నివాసి అయిన మాలోత్ లలియా గారికి కాగజ్ మద్దూర్ శివారు సర్వే నెంబర్ 429-ఓ, ఏ 1 నందు 26 గుంటల భూమి కలదని ఇట్టి భూమిలో గత సంవత్సరం నుండి హైదరాబాద్ వాస్తవ్యులు అయిన అరిగే రాజు విట్టల్ అనే వ్యక్తి కబ్జా చేసి నా భూమిని నాకు ఇవ్వమని అడుగగా నన్ను బెదిరించి, నానా బూతులు తిట్టారని కావున పైన తెలిపిన వ్యక్తి పైన చట్టపరమైన చర్య తీసుకోని తమకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని నర్సాపూర్ ఎస్.హెచ్.ఓకి పలు సూచనలు చేసినట్లు తెలిపారు.