- అదనపు కలెక్టర్ వీరారెడ్డి
సామాజిక సారథి, సంగారెడ్డి: ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలతో వచ్చిన సుమారు 50 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ జిల్లా అధికారి రాధికరమణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అర్జిదారులు పాల్గొన్నారు.