Breaking News

ధరలు తగ్గించాలి

ధరలు తగ్గించాలి

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవన, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఏఐడిడబ్ల్యూఏ) రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత అన్నారు. ఆదివారం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి రైతు చట్టాలను రద్దు చేసినట్లే, విద్యుత్ బిల్లుల సవరణ, అన్నదాతలు ఆరుగాలం పండించిన పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని లేని పక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నిరసనలో ఏఐడిడబ్ల్యూఏ జిల్లా నాయకురాలు శోభ, శ్రీలక్ష్మి, లక్ష్మిప్రియ, బాలమ్మ, లక్ష్మి, అలివేల కృష్ణవేణి పాల్గొన్నారు.