సారథి న్యూస్, రామాయంపేట: కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఫిబ్రవరి 1 నుంచి పున:ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లలో అన్ని ఏర్పాట్లు చేయాలని జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూలును సందర్శించారు. విద్యార్థులు, టీచర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సర్పంచ్గేరుగంటి అనూష, సెక్రటరీ అంజయ్య, పాఠశాల చైర్మన్ కొమ్మట బాగులు, హెచ్ఎం శ్రీనివాస్, టీచర్లు విజయ్ కుమార్, విజయ్ కృష్ణ, శ్రీశైలం, వినయ్, కవిత, రాధిక ఉన్నారు.
- January 21, 2021
- Top News
- CAROONA
- RAMAYAMPET
- SCHOOLS REOPENING
- కరోనా
- రామాయంపేట
- స్కూళ్ల ప్రారంభం
- Comments Off on స్కూళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు