Breaking News

సిద్దిపేట తాగునీటి వ్యవస్థకు ప్రశంసలు

సిద్దిపేట తాగునీటి వ్యవస్థకు ప్రశంసలు
  • అభినందించిన కేంద్ర జలమంత్రిత్వ శాఖ
  • ఇది సమష్టి కృషి ఫలితమే: మంత్రి హరీశ్ రావు

సామాజిక సారథి, హైదరాబాద్‌: సిద్దిపేట జిల్లాకు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వశాఖ నుంచి ప్రశంస లభించింది. ఈ మేరకు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్‌ సెక్రటరీ అరుణ్‌ బరోక అభినందన లేఖను జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులకు పంపించారు. భారత ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో మీ ప్రశంసనీయమైన పనిని, అలాగే నేషనల్​లెవల్​షార్ట్​ఫిల్మ్​ల పోటీ స్వచ్ఛ్‌ ఫిల్మ్‌ కా అమృత్‌ మహోత్సవ్‌ 2021లో పాల్గొనడాన్ని అభినందిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో షార్ట్​ఫిల్మ్​ల పోటీ(స్వచ్ఛత ఫిల్మోన్‌ కా అమృత్‌ మహోత్సవ్‌) 2021లో భాగంగా జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య విభాగంలో సాధించిన ఫలితాలను తెలుపుతూ జిల్లాలోని గ్రామపంచాయతీ కార్యదర్శులు జిల్లా స్థానిక సంస్థల అడిషనల్​కలెక్టర్‌ ముజమిల్‌ ఖాన్‌ పర్యవేక్షణలో 160కి పైగాషార్ట్​ఫిల్మ్​లను రూపొందించి పంపించారు. దీంతో జిల్లాలో అభివృద్ధిని వీక్షించి కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య విభాగం, జలశక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్‌ సెక్రెటరీ అరుణ్‌ బరోక అధికారులను అభినందిస్తూ లేఖను పంపారు. స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అధికారుల, సిబ్బంది కృషి, ప్రజల సహకారంతో సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు, పల్లెలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నామని మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణలో గ్రామాలు గతంలో లేనివిధంగా అద్భుతమైన ఫలితాలు సాధించాయని కొనియాడారు. దేశంలోని మిగతా గ్రామాలకు, ప్రజలకు ప్రేరణ ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొనడం మనందరికీ గర్వకారణం అని ఆయన పేర్కొన్నారు.