సామాజిక సారథి, ఐనవోలు: హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం మామూనూరు డివిజన్ ఏసీపీ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని అన్ని ప్రధాన కూడళ్ళలో వాహనాలను, కిరాణా షాపులను తనిఖీ చేశారు. అనంతరం మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏసీపీ నరేష్ కుమార్ గ్రామ ప్రజలకు నిషేధిత మత్తు పదార్థాల వినియోగం మైనర్ డ్రైవింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 18 వాహనాలు, 3 ఇసుక ట్రాక్టర్లు, ఒక ఇసుకను కడిగే యంత్రం, రూ.10 వేలు విలువైన బ్రాందీ సీసాలు, గుట్కా ప్యాకేట్లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ ఐనవోలు ఎస్సై భరత్, మామూనూరు డివిజన్ పరిధిలోని పోలీసులు పాల్గొన్నారు.