Breaking News

పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

పెండింగ్ బిల్లులు వస్తలేవు.. మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
  • మనస్తాపనతో టీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం 
  • పెండింగ్ బిల్లులు వస్తలేవు… వచ్చిన బిల్లులన్నీ సర్పంచ్ వాడుకుంటండు

సామజిక సారథి, నాగర్ కర్నూల్: బంగారు తెలంగాణలో ఓవైపు రైతులు, మరోవైపు నిరుద్యోగులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులకు కూడా ఆత్మహత్యలు తప్పడం లేదు. చేసిన పనులకు బిల్లులు రాలేదని, అప్పులబాధ ఎక్కువైందనే ఆందోళనతో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి తాలూకాలో ఊర్కొండ టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శ్రీనివాసులు నాగర్ కర్నూల్ కలెక్టర్ క్యాంపు ఆఫీసు ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పులు చేసి పనులు పూర్తి చేసిన, నేటికీ బిల్లులు రాకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పులోనికి ముఖం ఎలా చూపించాలని తీవ్రమనస్థాపన చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. తనకు రూ. 4లక్షలు రావాల్సి ఉందన్నాదని, గతంలో చాలాసార్లు కలెక్టర్, పలు శాఖల ఉన్నతాధికారులకు విన్నవించినా బిల్లులు రాలేదని వాపోయాడు. వచ్చిన బిల్లులను ప్రస్తుత సర్పంచ్ వాడుకుంటున్నాడని ఆరోపించారు. అందువల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేకల శ్రీనివాసులు ఊరుకొండ వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి, నాయకులు శ్రీధర్ రెడ్డి, నాగోజీ తదితరులు ఉన్నారు.