సామాజిక సారథి, హలియా: స్వరాజ్య స్థాపన కోసమే సీహెచ్ విశారదన్ మహారాజ్ దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామని డీఎస్పీ మండల అధ్యక్షుడు పరుశురాం మహారాజ్ అన్నారు. శుక్రవారం తిరుమల గిరి మండలంలోని డాక్టర్ విశారదన్ మహారాజ్ స్వరాజ్య పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ స్వరాజ్య సంఘీభావ పాద యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరాజ్య స్థాపన కై డా. విశారదన్ మహారాజ్ చేపట్టబోయే పాదయాత్రకు బీసీ,ఎస్సీ,ఎస్టీ లు తరలిరావాలన్నారు. కల్వకుర్తి లో వాయిదా పడ్డ స్వరాజ్య పాదయాత్ర తేదీని త్వరలో డీఎస్పీ అధినాయకత్వం ప్రకటిస్తూందన్నారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి నాగయ్య మహారాజ్, మండల ఉపాధ్యక్షుడు వెంకట్ మహారాజ్, శంకర్ మహారాజ్, నాగరాజు మహారాజ్, రవితేజ, సైదులు, మహారాజ్, చంద్రయ్య మహారాజ్ , శంకర్ మహారాజ్, తిరుమల్ మహారాజ్, జాని బాబు మహారాజ్, శరత్ మహారాజ్, శ్రవణ్ మహారాజ్, అంజి మహారాజ్, వంశీ మహారాజ్, రాఖీ మహారాజ్ , ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
- January 15, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- PADAYATRA
- Sthapanake
- Swarajya
- Visharadhan
- పాదయాత్ర
- విశారధన్
- స్థాపనకే
- స్వరాజ్య
- Comments Off on స్వరాజ్య స్థాపనకే పాదయాత్ర