సారథి, బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి భారీవర్షం కురిసింది. ముఖ్యంగా బిజినేపల్లి మండలంలో కుండపోత వాన దంచికొట్టింది. దీంతో మండలంలోని పెద్దవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరంతా పొంగిపారుతూ పాలెం పెంటోనీ చెరువుకు భారీగా నీరు చేరుతోంది. బిజినేపల్లి నుంచి వట్టెం వెళ్లే మార్గంలో బైక్లు, చిన్న చిన్న వాహనాలు వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వాహనదారులు చుక్కలు చూశారు. వాగునీరు ఒక్కసారిగా వరద పారడంతో సమీపంలోని పంట పొలాలు కోతకు గురయ్యాయి. కాగా, వారం రోజులుగా బిజినేపల్లి మండలంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. పాత ఇళ్లల్లో నివాసం ఉంటున్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
- July 18, 2021
- Archive
- Top News
- BIJINEPALLY
- HEAVY RAIN
- PEDDAVAGU
- నాగర్కర్నూల్
- పెద్దవాగు
- బిజినేపల్లి
- Comments Off on కుండపోత కురిసింది.. పెద్దవాగు పొంగింది