అలంపూర్ లో మాదిగ ఆత్మగౌరవ విశ్వరూప మహాసభలో మంద కృష్ణ మాదిగసామాజిక సారధి, అలంపూర్ :
… మాదిగల అంతిమ లక్ష్యమే వర్గీకరణ పోరాటమని మంద కృష్ణ మాదిగ అన్నారు . శనివారం అలంపూర్ లోని ఎమ్మార్పీఎస్ , ఎమ్మెస్ ఎఫ్ పార్టీ ఆధ్వర్యంలో మాదిగల విశ్వరూప పాదయాత్ర కార్యక్రమానికి హాజరయ్యారు . అలంపూర్ లో ఉన్న బాల బ్రహ్మేశ్వర దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు . అనంతరం కార్యకర్తలతో భారీగా ర్యాలీగా సభా స్థలానికి చేరుకున్నారు . అనంతరం సభా వేదిక నుండి భారీగా కార్యకర్తలతో కలిసి అలంపూర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్రను ప్రారంభం చేశారు . ఈ సందర్భంగా వారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వర్గీకరణ కొరకు 28 సంవత్సరాల పాటు పోరాటం చేస్తున్న , అప్పటి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్ల పేరుతో మాదిగలను మోసం చేస్తున్నాయని అన్నారు . 28 సంవత్సరాల పాటు వర్గీకరణ కొరకు ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రవ్యాప్తంగా నలుమూలల నుండి పాదయాత్రలు , రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్రలు చేసి మా ఏకైక లక్ష్యం వర్గీకరణ చేయాలని ప్రభుత్వాలతో కొట్లాడింది వాస్తవం కాదా అని అన్నారు . అప్పటి ప్రభుత్వాలు రెండుసార్లు కమిషన్లు ఏర్పాటు చేసి వర్గీకరణ చేయాలని నివేదికలిచ్చిన , మనల్ని నిత్యం మోసం చేస్తున్నారని అన్నారు . ఇప్పటికే నా ఆరోగ్యం సరిలేకున్న , రెండు కాళ్లలో రాడ్ల తో ఉన్న , మోకాళ్ల నొప్పులు ఉన్న , నా మాదిగ సోదరులకు వర్గీకరణ సాధించి ఇవ్వాలని లక్ష్యంతోనే ప్రాణాన్ని పణంగా పెట్టి మాదిగల విశ్వరూప పాదయాత్రను మొదలుపెట్టానని అన్నారు . ఇదే నా చివరి పోరాటమని , వచ్చే చివరి పార్లమెంటు సమావేశంలో కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ బిల్లు పెట్టే విధంగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మార్పీఎస్ నేతలు ఏ రాజకీయ పార్టీలలో ఉన్న మనకు లాభం లేదని , ఎవరు అధికారంలో కూర్చున్న , రాకున్నా మాది లకు జరిగే లాభం లేదని అన్నారు . రాష్ట్రంలో ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషన్ ఉన్న 13 శాతం మాలలకే లబ్ధి చేరుతుందని , కేవలం రెండు శాతం మాత్రమే మాదిగలకు వస్తుందని అన్నారు . నరేంద్ర మోడీ వర్గీకరణ అంశంపై సానుకూలంగా స్పందించారని , వచ్చే నెలలో జరగబోయే పార్లమెంటు సమావేశంలో బిల్లు ఆమోదం తెలిపేందుకు ప్రతి ఎమ్మార్పీఎస్ నేత మాదిగ ఉప కులాలకు చెందిన సైనికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటం చివరిగా భావించాలని దాని కొరకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వారికి తెలిపారు . వర్గీకరణ కొరకు ఇదే పోరాటం చివరిగా భావించాలని అందుకోసమే పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాదిగ సోదరులు కలిసికట్టుగా ఉండి బిల్లు పెట్టేందుకు పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు . కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని మాట ఇచ్చిందని , దానిని నెరవేర్చు వరకు మన పోరాటాలు చేయాలని వారు తెలిపారు . ఇప్పటికే కేసీఆర్ , చంద్రబాబు నాయుడు , రాజశేఖర్ రెడ్డి లాంటివారు వర్గీకరణ పేరుతో మాదిగలను ప్రతిసారి మోసం చేశారని , ఇక మోసపోవడానికి మాదిగలు సిద్ధంగా లేరని తెలియజేసేందుకు ఈ మహా విశ్వరూప పాదయాత్రను చేపట్టినట్టు వారు తెలిపారు . కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు శివ , టైగర్ జంగయ్య , కరిగిళ్ళ దశరథం , విజయ్ , మస్తాన్ మాదిగ , శ్రీనివాసులు , తదితరులు ఉన్నారు .
- October 7, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on మాదిగలు అంతిమ లక్ష్యమే వర్గీకరణ