- 55.02 ఎకరాల మా భూమిను రియల్ ఎస్టేట్ వెంచర్ కు అమ్ముకున్నరు
- వెల్దండ తహసీల్దార్ ఆఫీసు ఎదుట బాధిత రైతుల ఆందోళన
సామాజికసారథి, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా మండలంలోని చెర్కూర్ శివారులో చౌదర్ పల్లి రైతులకు సంబంధించిన 55.02 ఎకరాల భూమిని కొంతమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు కలిసి ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపిస్తూ.. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధిత రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 1953 నుంచి ఇప్పటివరకు సర్వేనంబర్లలో 140, 141, 142, 143లో 15 కుటుంబాలు సాగుచేస్తున్నారని, దీనికి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, తహసీల్దార్ మామిడి కృష్ణ తమను అన్యాయం చేశారని వాపోయారు. దీనికోసం ఆర్డీవో రాజేష్ కు రూ.10 లక్షలు లంచం ఇచ్చామని తమ గోడు వెళ్లబోసుకున్నారు. అదేవిధంగా 16న రాత్రి సమయంలో రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ మామిడి కృష్ణపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా చేయించారని ఆరోపించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్ కార్యాలయాన్ని సందర్శించి రైతులకు సంబంధించిన 55.02 భూమిని బ్లాక్ చేస్తున్నట్లు తెలిపారు.