– ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు
-ప్రజలకు అందుబాటులో ప్రజాపాలన భవన్
-ఏ సమస్య వచ్చినా ప్రజాపాలన భవన్ తలుపులు తట్టండి
-అందరి సహకారంతో నియోజక వర్గ అభివృద్దికి కృషి
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజాపాలన భవన్ (క్యాంప్ ఆఫీస్ ) నూతన గృహ ప్రవేశం బుధవారం జిల్లా కేంద్రంలో కన్నుల పండువగా కొనసాగింది. నియోజక వర్గ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్, డాక్టర్ సరిత దంపతులు అధికారిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అడుగు పెట్టారు. ఎమ్మెల్యే దంపతులు ప్రజాపాలన క్యాంప్ ఆఫీసులో వేద పండితుల మంత్రోత్సవంతో ప్రత్యేక హోమం , పూజలు నిర్వహించిన అనంతరం సంప్రాదాయబద్దంగా నూతన గృహ ప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. నియోజక వర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో కళకళలాడుతూ ఎదగాలని వారు ఆకాంక్షించారు.
ఈ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తో ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ) తలుపులు అన్ని వేళలా తెరిచి ఉంటాయన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ప్రజా పాలన భవన్ తలుపులు తట్టాలని వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామినిచ్చారు.