- నన్ను ఎవరూ బుజ్జగించినా లొంగిపోను
- ఎమ్మెల్సీ హోదాలో సీఎం సభకు వెళ్లా..
- ఎదురైన అవమానాలను మరిచిపోలేను
- నాపై మీడియాలో కథనాలు సరికాదు
- ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: ఒక్కసారి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి స్పష్టంచేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని, తన అనుచరులు, కార్యకర్తలకు జరిగిన ఇబ్బందులను మరిచిపోనని అన్నారు. ‘నన్ను ఎవరూ బుజ్జగించలేదు.. ఎవరు బుజ్జగించినా లొంగిపోయేది లేదు’అని ఆయన స్పష్టంచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ హోదాలో తాను గద్వాల సీఎం కేసీఆర్ సభకు వెళ్లాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పు ఖాయమని.. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రజల సమక్షంలో చెబుతానని అన్నారు. తనను ఎవరో బుజ్జగిస్తే వెనక్కి తగ్గినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ప్రజల కోసం చివరి దాకా నిలబడతానని అన్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి తన ఊపిరి ఉన్నంత వరకు కృషిచేస్తానని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డి పునరుద్ఘాటించారు. మీడియాలో తనపై వచ్చిన తప్పుడు వార్తలను ఖండించారు.
ఎన్నో సార్లు ఎమ్మెల్యే గా ఓడిపోయిన దాని కంటే ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నావా తాత..
అయినా సరే అవినీతి సొమ్ము బాగా నే సంపాదించి ఉంటావ్ కదా…