సామాజిక సారథి, నవాబుపేట్: దళితుల భూములు ఆక్రమిస్తే జైలుకు వెళ్లడం ఖాయమనీ మానవ హక్కుల నాయకులు రాములు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని గురుకుంట గ్రామ శివారులో గలా సర్వే నెంబర్ 53,64/2 ప్రభుత్వ పట్టా భూమి ఇనాం, గైరాన్ భూములను ఆక్రమించి రోడ్డు వేసిన వ్యక్తులు, నవాబుపేట్ మెడికల్ డాన్ సిద్దూ, రాజేష్ ప్రతినామం కొండల్, దరిపల్లి శివారు సర్వేనెంబర్ 201 పట్టడారులు వెంకటేష్ గౌడ్, వెంకటేష్ కుమారుడు శ్రీకాంత్ గౌడ్, విజయ్ రామగౌడ్, శ్రీధర్ గౌడ్ , గుమ్మడి యాదయ్య , జేసీబీ యజమాని ఆంజనేయులు గౌడ్, డ్రైవర్ శ్రీకాంత్ లు జైలుకు పోవడం ఖాయమని మానవహక్కుల నాయకులు రాముడు తెలిపారు. శుక్రవారం గురుకుంట ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు ఆయన వివరించారు. గురుకుంట పెద్దభూస్వామి మహిపల్ రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి తన భూమిని కూడా ఆక్రమించి రోడ్డు వేయుటకు ప్రయత్నించారని అదే విధంగా దళితులు దున్నుకుంటున్న భూమి ప్రక్కనే తమభూమి ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దళిత నాయకులు డీబీ యస్ యూ జిల్లా కార్యదర్శి ఆనంద్, రజక సంఘం నాయకులు వెంకటయ్య, రైతులు యాదయ్య, ప్రవీణ్, శ్రీనివాస్, భూకబ్జా నుండి మమ్ములను కాపాడు మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
- December 6, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- DALITS
- LANDS
- Nawabpet
- occupation
- ఆక్రమణ
- దళితుల
- నవాబ్ పేట
- భూములు
- Comments Off on దళితుల భూములు ఆక్రమణ