- వెల్లడించిన ఎలక్షన్కమిషన్
- ఓటరు జాబితా విడుదల
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఓటర్ల జాబితా 2022ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దాఖలైన దరఖాస్తులను పరిష్కరించిన కేంద్ర ఎన్నికల సంఘం అనంతరం ఓటర్ల ఫైనల్లిస్టును ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో మొత్తం ఓటర్లు 3,03,56,894 మంది ఉన్నారని తెలిపింది. ఇందులో పురుష ఓటర్లు 1,52,56,474 మంది, మహిళా ఓటర్లు 1,50,98,685 మంది, ఇతర ఓటర్లు 1,735 మంది ఉన్నారని వెల్లడించింది. ఓటర్ల జాబితాలో 18–19 ఏళ్ల మధ్య ఓటర్ల సంఖ్య 1,36,496గా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. 2021తో పోలిస్తే మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు రెండులక్షలు పెరిగినట్లు వివరించింది. మొదటిసారి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా.. నేరుగా ఇళ్లకు పంపుతామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.