Breaking News

ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీస్ టెక్నీకల్ అసిస్టెంట్

ఏసీబీకి చిక్కిన ఎన్ఆర్ఈజీ స్ టెక్నీకల్ అసిస్టెంట్

 సామాజిక సారథి, ధర్మసాగర్:  హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రం లోని ఎంపీడీవో కార్యాలయంలో  ఎన్ ఆర్ ఈ జీ ఎస్  టెక్నీకల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న యాదగిరి  రైతు లింగయ్య దగ్గర రూ. 10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. మజ్జిగ లింగయ్య ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నువ్వుల పంట  మెయింటైన్ బిల్లు మంజూరు కోసం యాదగిరిని ఆశ్రయించగా లింగయ్య దగ్గర రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇస్తామని ఒప్పుకున్న రైతు లింగయ్య  ఎసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో పక్కా ప్రణాళికతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం లంచం తీసుకుంటున్న యాదగిరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతడిపై కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు.