సారథి, రామడుగు: బీజేపీ అధికారంలోకి వస్తే అచ్చే దిన్ అని చెప్పారు కానీ ఇప్పుడు ఏడేళ్ల పాలన చూస్తే సచ్చేదిన్ లాగా ఉందని కాంగ్రెస్ బీసీసెల్ చైర్మన్ పులి ఆంజనేయులు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. తప్పుడు వాగ్దానాలతో దేశ ప్రజలను పక్కదోవపట్టించారని విమర్శించారు. ప్రతి పేదవాడి అకౌంట్లోకి రూ.15లక్షలు, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తీసుకొస్తామని తప్పుడు ప్రచారంతో రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం కరోనా మహమ్మారిని నియంత్రణ చేయలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా టీకాలు ప్రజలకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టంచేశారు. ఇకనైనా కరోనా నుంచి ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు.
- May 30, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BC CELL
- BJP
- CONGRESS
- కాంగ్రెస్
- బీజేపీ
- బీసీసెల్
- Comments Off on అచ్చే దిన్ కాదు.. సచ్చే దిన్