సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బుధవారం పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులను విడతల వారీగా ఇస్తామని, రానున్న రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ స్పష్టంచేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆఫ్షన్ సభ్యుడు సుక్రోద్దీన్, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీడీవో మల్హోత్రా, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కల్గెటి లక్ష్మణ్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
- July 28, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- MLA SUNKE
- RAMADUGU
- ration cards
- చొప్పదండి ఎమ్మెల్యే సుంకే
- పింఛన్లు
- రామడుగు
- రేషన్‌కార్డులు
- Comments Off on త్వరలోనే కొత్త పింఛన్లు కూడా..