కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కాన్సెప్ట్ బేస్డ్ అని తేడా లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది లేడీ సూపర్‌స్టార్ నయనతార. ప్రస్తుతం విజయ్ సేతుపతి, సమంతలతో కలిసి ‘కాత్తువాక్కుల రెండు కాదల్’లో నటిస్తున్న నయన్, తాజాగా ‘గోల్డ్’ అనే మలయాళ సినిమాకు సైన్ చేసింది. ‘ప్రేమమ్’ సినిమాతో మెప్పించిన ఆల్ఫాన్స్ పెత్రెన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్‌కు జంటగా నయన్ నటించనుంది. పృథ్విరాజ్ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా. నయన్ గత చిత్రం ‘నేత్రికన్’లో నెగిటివ్ రోల్ చేసిన అజ్మల్ అమీర్ ఇందులోనూ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇదే దర్శకుడితో నయన్ ‘పాటు’ అనే మ్యూజిక్ మూవీ చేయాల్సి ఉంది. పహాద్ ఫాజిల్ ఇందులో హీరో. కొన్ని అవాంతరాలతో అది స్టార్ట్ అవలేదు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పృథ్విరాజ్, నయన్ కాంబినేషన్ లో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు ఆల్ఫాన్స్. ఈనెల మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకానుంది. దర్శకుడి ఫస్ట్ మూవీ ‘నేరమ్’ తరహాలో ఇది కూడా ఓ థ్రిల్లర్ అని తెలుస్తోంది.