నేచురల్ స్టార్ నాని 30వ చిత్రానికి నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించనున్నారు. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ ఈ చిత్రాన్ని వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భారీ ఎత్తున, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముహూర్తం షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు విజయేంద్ర ప్రసాద్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి మేకర్స్ కి స్క్రిప్ట్ అందజేశారు. ‘పలాస’ కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు, సురేష్ బాబు, దిల్ రాజు, 14 రీల్స్ గోపి- రామ్ ఆచంట, ఎకె అనిల్ సుంకర, మైత్రి రవి, డివివి దానయ్య, స్రవంతి రవి కిషోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి, ఏషియన్ సునీల్, అభిషేక్ అగర్వాల్, నిహారిక కొణిదెల, కళ్యాణ్ దాసరి తదితరులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపు హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనున్నారు. సాను జాన్ వర్గీస్ ఐఎస్సీ డీవోపీ, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందించనున్నారు. ప్రవీణ్ ఆంథోని ఎడిటర్, జోతిష్ శంకర్ ప్రొడక్షన్ డిజైనర్, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు.
- February 1, 2023
- Archive
- CINEMA GALLERY
- Top News
- సినిమా
- Cinema
- తెలంగాణ
- Comments Off on నాని30 ప్రారంభం..