Breaking News

నాగోల్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

నాగోల్ ఫ్లై ఓవర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

సామాజిక సారథి, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నుండి ఉప్పల్ వెళ్ళే మార్గంలో నాగోల్ చౌరస్తా వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ ను బుధవారం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎస్ఆర్డీపీ నిధుల నుంచి తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మరో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. నాగోల్ ప్రాజెక్ట్ మొత్తం కలిపి  రూ.143.58 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్ లో నెలకొన్న అనేక సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కొన్ని ప్రాంతాల్లో పలు చోట్ల ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కారం చేసి, నాలుగు ఐదు రోజుల్లో వచ్చి పరిష్కరించి తీపి కబురు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటి మేయర్ శ్రీలతరెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, బోగ్గారపు దయానంద్ గుప్త, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్  ఉప్పల శ్రీనివాస్ గుప్త, స్ధానిక కార్పొరేట్ చింతల అరుణ సురేందర్ యాదవ్,పవన్ కుమార్, , మాజీ కార్పొరేటర్లు,పలు డివిజన్ ల అధ్యక్షులు, నాయకులు మరియు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.