సామాజిక సారథి , బిజినపల్లి ….. మండల పరిధిలో ని కిమ్య తండా గ్రామ పంచాయితీ సర్పంచ్ అంజి భర్త , గంగరాం డీలర్ అంగొత్ కృష్ణా నాయక్ శుక్ర వారం రాత్రి అకస్మాత్తుగా గుండే పోటుతో మరణించడంతో లట్టుపల్లి గ్రామంలో అయన ఇంటికి వెళ్ళి కృష్ణా నాయక్ పార్థివ దేహానికి డా . రాజేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించా రు . వారి మరణం పట్లతీవ్ర సంతాపం తెలిపి కృష్ణా నాయక్ పార్థివ దేహాన్ని చుసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన డా . రాజేష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణ నాయక్ మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ గురైన అని తెలిపారు . మంచి తమ్ముడిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది అన్నారు . ఆయన మరణం బిఅర్ఎస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు . వారి కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ,ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు . వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు . ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ స్వామి , తిరుపతయ్య , చందర్ గౌడ్ , మాన్య నాయక్ , గోపి నాయక్ పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .
- January 28, 2023
- Archive
- Top News
- తెలంగాణ
- మహబూబ్నగర్
- తెలంగాణ
- Comments Off on కృష్ణా నాయక్ చిన్న వయస్సులో గుండే పోటుతో మరణించడం చాలా దురదృష్టకరం….. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి – డా . రాజేష్ రెడ్డి