సామాజిక సారథి, సంగారెడ్డి: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో సమాజంలో సకలాంగులతో సమానంగా జీవించేలా ముందుకు సాగాలని అదనపు కలెక్టర్ రాజార్షిషా అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా మహిళ ,శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఉన్నత స్థాయిలో జీవించడానికి వికలాంగులకు అంగవైకల్యం అడ్డుకారాదని, పట్టుదలతో కృషి చేస్తే లక్ష్యాలను సాధిస్తారన్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థకార్యదర్శి ఆశాలత, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, జిల్లా మహిళ, శిశు, వికలాంగుల సంక్షేమశాఖ అధికారిణీ పద్మావతి, ఏపీడీ సూర్యారావు, ఎంపీడీవోలు, సీడీపీవోవోలు, ఏపీఎంలు, పంచాయతీ కార్యదర్శులు వివిధ వికలాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.
- December 10, 2021
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- ఆత్మస్థైర్యంతో
- కలెక్టర్
- ముందుకు
- రాజార్షి
- షా
- సంగారెడ్డి
- సాగాలి
- Comments Off on ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి