సారథి, మంగపేట: ములుగు జిల్లా మంగంపేట మండలంలోని నర్సింహాసాగర్ గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 10 కుటుంబాలకు ఎమ్మెల్యే సీతక్క స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనాతో మరణించిన ఈసం లేపాక్షి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, భౌతికదూరం పాటిస్తూనే మాస్కులు ధరించాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలు బయటకు రావొద్దని సీతక్క కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, సీతక్క యువసేన మండలాధ్యక్షుడు సిద్ధ బత్తుల జగదీశ్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మురుకుట్ల నరేందర్, గ్రామ అధ్యక్షుడు కాటబొయిన నర్సింహారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె శ్రావణ్ కుమార్, శ్రీరామ్ రామ్మోహన్, దోమల నరేందర్, తాతినెని హరికృష్ణ, పోతుమర్తి వెంకటేశ్వర్లు, కొడమ్ నర్సింహులు, యూత్ నాయకులు బోడ సతీష్, దూదిగాని సాంబశివరావు, చెట్టుపల్లి శ్రీకాంత్, డోలా ప్రవీణ్ పాల్గొన్నారు.
- May 15, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- వరంగల్
- షార్ట్ న్యూస్
- COVID19
- mangampet
- MLA SITHAKKA
- MULUGU
- ఎమ్మె్ల్యే సీతక్క
- కొవిడ్
- మంగంపేట
- ములుగు
- Comments Off on ఎమ్మెల్యే సీతక్క గొప్ప మనస్సు