- ఇందులో సౌకర్యలు, సౌలభ్యాలు ఎక్కువే
- ప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం కూడా ఎక్కువే
చెన్నై: భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తన కుటుంబంతో కలిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ 17వీ5 ఇది మిలిటరీ రవాణా విమానం. రష్యాకు చెందిన కాజాన్ హెలికాప్టర్స్ దీనిని తయారుచేసింది. ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలికాప్టర్ గా దీనికి పేరుంది. భద్రతా బలగాల రవాణా, అగ్ని ప్రమాదాల కట్టడికి, కాన్వాయ్ ఎస్కార్టుగా, పెట్రోలింగ్ విధులు, గాలింపు చర్యలు తదితర ఆర్మీ ఆపరేషన్స్‌లో విరివిగా దీనిని ఉపయోగిస్తారు. ఇందులో మొత్తం ముగ్గురు సిబ్బందితో కలిసి 39 మంది ప్రయాణించవచ్చు. ఆధునిక సిస్టంతో పాటు అత్యవసర సమయాల్లో సహకరించే ప్లోటేషన్ సిస్టమ్స్ సదుపాయం ఉంది. ఇది సుమారు 4, 500 కిలోల బరువు వరకు మోసుకెళ్లగలదు. ఇక శత్రువుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు రాకెట్లు, 23 మెషిన్ గంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంది.
2013లో హెలికాప్టర్లను ఆర్డర్ చేసిన భారత్
హెలికాప్టర్లను భారత రక్షణ శాఖ 2013 ఫిబ్రవరిలో మొదటిసారిగా ఆర్డర్ చేసింది. అప్పటి ‘ఏరో ఇండియా ఎయిర్ షో’ సందర్భంగా మొత్తం 12 హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. కాగా మొత్తం 80 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి భారత రక్షణ శాఖ రష్యన్ హెలికాప్టర్స్ మధ్య 2008 డిసెంబర్లో 1.3 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది. ఈ ఎంవోయూలో భాగంగానే రష్యన్ హెలికాప్టర్స్ 2011 నుంచి హెలికాప్టర్లను భారత్‌కు అందజేస్తోంది. ఇలా 2013 ప్రారంభం వరకు మొత్తం 36 హెలికాప్టర్లు భారత గడ్డమీద అడుగుపెట్టాయి. అదేవిధంగా 2012-13 మధ్యకాలంహెలికాప్టర్ల కొనుగోలు కోసం భారత రక్షణ శాఖ, రొసొబరోనెక్స్‌పోర్ట్ మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. ఈ రొసొబరోనెక్స్‌పోర్ట్ 2018 జూలైలో చివరిసారిగా ఇండియాకు హెలికాప్టర్‌ను డెలివరీ చేసింది. అయితే హెలికాప్టర్ల రిపేరింగ్, సర్వీసింగ్ సేవలను భారత వాయుసేన 2019 ఏప్రిల్‌లో ప్రారంభించింది. ఎన్ని ఆధునిక సదుపాయాలు, రక్షణ సౌలభ్యాలున్నా అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.