Breaking News

ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం

ఎమ్మెల్యే సీతక్క గొప్ప హృదయం

సారథి ప్రతినిధి, ములుగు: ములుగు ఎమ్మెల్యే సీతక్క మరోసారి గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం గుర్రంపేటలో సుమారు 130 కుటుంబాలకు గురువారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్ వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒక్కపూట తిండికి కూడా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పేదల ఆకలి తీర్చడం కోసం కనీసం ముఖ్యమంత్రి ఆలోచించకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రతినెలా ప్రతి పేద కుటుంబానికి రూ.ఆరువేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ప్రతి పేద కుటుంబానికి కార్పొరేట్ వైద్యం అందించేందుకు సీఎం చొరవ చూపాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవిచందర్, మండలాధ్యక్షుడు సూర్యనారాయణ, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాటోత్ గణేష్, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు మూడు వీరేశ్, ఎంపీటీసీ బనోత్ భాస్కర్, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎండీ వసీం, ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.