సారథి న్యూస్, యాచారం: బీఫ్ తినేవారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టబొమ్మను ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో దహనం చేశారు. కేవీపీఎస్ పిలుపుమేరకు కొత్తపల్లి గ్రామంలో భారీ ర్యాలీ తీసి రాజాసింగ్ దిష్టిబొమ్మతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కావలి జగన్, ప్రజానాట్యమండలి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు గోరెటి రమేష్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిక్కుడు గుండాలు, ఎమ్మార్పీఎస్ గ్రామాధ్యక్షుడు కంబాలపల్లి జంగయ్య, టీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు పోలే శివ, కేవీపీఎస్ గ్రామ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు జంగయ్య, దశరథ, కృష్ణకుమార్, శివశంకర్, శివఎల్లయ్య, బుచ్చయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
- March 1, 2021
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- beef
- BJP
- KVPS
- mla rajasingh
- ఎమ్మెల్యే రాజాసింగ్
- కేవీపీఎస్
- బీజేపీ
- బీఫ్
- Comments Off on ఎమ్మెల్యే రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం