Breaking News

క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్

క్రీడాకారినికి ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్
  • ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కు ఎంపికైన మార్షల్ ఆర్ట్స్ విద్యార్థిని
  • చంద్రికకు రూ.3 లక్షలు ఆర్థిక సహాయం
  • భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం
  • క్రీడల పట్ల అభిమానాన్ని చాటుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్

సామాజిక సారథి, పటాన్‌చెరు: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు క్రీడల పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. క్రీడారంగంలో పటాన్‌చెరు నియోజకవర్గానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్న క్రీడాకారులకు అండగా నిలుస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ లో సంచనాలు సృష్టిస్తున్న స్థానిక లక్కీ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థిని చంద్రికకు ఎమ్మెల్యే జీఎంఆర్ అండగా నిలిచారు. ఏషియన్ కరాటే ఛాంపియన్షిప్ కి చంద్రిక ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే జీఎంఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీ కార్మిక భాగం రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్ లు చంద్రికకు రూ. 3లక్షల చెక్ ను అందజేశారు. భవిష్యత్తులో చంద్రిక పాల్గొనబోయే అంతర్జాతీయ పోటీలకు ఎమ్మెల్యే జీఎంఆర్ సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు.

ఛట్ పూజ ఏర్పాట్ల పరిశీలించిన

ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ సందర్భంగా పటాన్‌చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపైన చేస్తున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 31న పటాన్‌చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విభిన్న సంస్కృతులకు నిలయంగా పటాన్‌చెరు నియోజకవర్గం నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, బల్దియా డిప్యూటీ కమిషనర్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.