సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలని బీజేపీ చెన్నూరు నియోజకవర్గ నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన కూడా ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు రూ. వేలకోట్లను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ నియోజకవర్గం ప్రజలకు చేసిందేమి లేదని, ఒక దళితున్ని వెన్నుపోటు పొడిచి, ఎమ్మెల్యేగా గద్దెనెక్కి ఒక మాఫియాను తయారు చేసి వందల కోట్లు దండుకున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గ కన్వీనర్ అక్కల రమేష్, మందమర్రి పట్టణ అధ్యక్షులు సప్పిడి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్, నగేష్, ఉపాధ్యక్షులు గల్లాపెళ్లి ఓదెలు, బీజేవైఎం అధ్యక్షులు సురేందర్, రంజిత్, సాయి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
- October 28, 2022
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- Balka
- MLA
- RESIGN
- should
- Suman
- Comments Off on ఎమ్మెల్యే బాల్క సుమన్ రాజీనామా చేయ్యాలి