సారథి న్యూస్, నిజాంపేట: గంగపుత్రులకు మంత్రి శ్రీనివాస్యాదవ్క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్చేశారు. తమ వృత్తిని ముదిరాజ్ కులస్తులకు అప్పగించే ప్రయత్నాన్ని మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో గంగపుత్ర యువత, గంగపుత్రుల్లో ఉన్న మేధావి వర్గాలతో చర్చించి ఒక కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే చెరువులు, కుంటలు గంగపుత్రుల చేతుల్లోనే ఉండేవని గుర్తుచేశారు. ముదిరాజ్ ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మత్స్య సహకార సంఘాల్లో ముదిరాజ్ కులస్తులకు సభ్యత్వాలు ఇవ్వడం మానుకోవాలని సూచించారు. అనంతరం మండల తహసీల్దార్ జయరాంకు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల గంగపుత్ర సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
- January 16, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- GANGAPUTRA
- HYDERABAD
- MINISTER TALASANI MUDIRAJ
- గంగపుత్రులు
- మంత్రి తలసాని
- ముదిరాజ్ ఆత్మగౌరవ సభ
- హైదరాబాద్
- Comments Off on గంగపుత్రులకు మంత్రి సారి చెప్పాలే