సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణ బిడ్డ, ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మనందరికీ గర్వకారణమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. గోరటి వెంకన్న సాహిత్యం తెలంగాణ ఆత్మను సాక్షాత్కరించేలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. ‘‘వల్లంకి తాళం’ రచనతో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన గోరటి వెంకన్న గారికి ఆత్మీయ అభినందనలు. తన సాహిత్యంతో తెలంగాణ జీవన చిత్రాన్ని కళ్లకు కట్టిన గొప్ప సాహితీవేత్త. ఉమ్మడి పాలమూరు నుంచి ఉవ్వెత్తున ఎగసిన సాహితీశిఖరం, ఉద్యమ కెరటం గోరటి వెంకన్న. తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా తనదైన పాత్ర పోషించిన గోరటి వెంకన్న, తాజాగా దేశవ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు.’ అని ప్రశంసించారు.
- January 3, 2022
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on గోరటి వెంకన్నకు మంత్రి అభినందనలు