సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: మల్కపేట ప్యాకేజీ- 9 పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ సూచించారు. టన్నెల్ లో ప్రతిరోజు సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ పనులు చేసేలా చూడాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ప్యాకేజీ 9 పనులపై శనివారం ఆమె సమీక్షించారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసేలా చూడాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. టన్నెల్ లో సుమారు 80 మీటర్ల మేర లైనింగ్ పనులను పూర్తిచేసేలా చూడాలన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలోరాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్, ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, ఎస్ఈ సుధాకర్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్, ఆర్డీవో శ్రీనివాసరావు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.
- February 6, 2021
- Archive
- Top News
- తెలంగాణ
- MALKAPETA
- RAJANNASIRICILLA
- SWITHASABARWAL
- మల్కపేట ప్యాకేజీ- 9
- రాజన్న సిరిసిల్ల
- స్మితా సబర్వాల్
- Comments Off on మల్కపేట ప్యాకేజీ- 9 పనులను కంప్లీట్ చేయాలే