సామాజిక సారధి , బిజినేపల్లి :ఈనెల 4వ తేదీ నుండి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదేళ్ల ప్రజా ప్రస్తావనం పాదయాత్రను మండల పరిధిలోని మంగనూరు గ్రామం నుండి ప్రారంభం అవుతుందని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులేందర్ రెడ్డి అన్నారు. ఈ పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెలిపారు . మంగనూరు గ్రామంలో క్లస్టర్ ఇంచార్జి , ఆ గ్రామ బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు , ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పదేళ్లపాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వం నుండి వచ్చే నిధులనే కాకుండా తాను సొంత ఎం జే అర్ ట్రస్టు ద్వారా నియోజవర్గంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి పనులకే కాక పేద వర్గ ప్రజలకు వైద్య , విద్య కోసం లక్షల రూపాయలను ఖర్చు చేశాడని ప్రతి గ్రామంలో మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ అభిమానులే కాకుండా వారి సొంత అభిమానులు ఎక్కువగా ఉన్నారని అలాంటి నాయకుడు పాదయాత్ర పేరుతో గ్రామాలకు వస్తున్నందున మనమందరం కలిసి ఘనంగా స్వాగతం తో పలికి వారి పాదయాత్రను విజయవంతం అయ్యేందుకు , రైతులు మహిళలు , యువకులు , ఉద్యమకారులు అందరూ హాజరయ్యి వారికి భ్రమరతం పట్టాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగనమోని కిర ణ్ , ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ , ఎంపీటీసీ తిరుపతయ్య , నాగిరెడ్డి తదితరులు ఉన్నారు .