.. స్థల పరిశీలన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి
సామాజిక సారథి , బిజినేపల్లి: ఈ నెల 22న బిజినపల్లిలో నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు . బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నాయకులతో బిజినపల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ స్థల ఏర్పాటును ఆయన పరిశీలించారు . రాష్ట్రంలో బీ ఆర్ఎస్ పార్టీకి ఈ ఆత్మ గౌరవ సభ చూసి రాష్ట్రంలో నిరంకుశ పాలన చేస్తున్న కెసిఆర్ కు దిమ్మతిరగాలని అందుకోసం కార్యకర్తలు విస్తృతంగా పనిచేయాలని వారు తెలిపారు . ఆత్మగౌరవ సభకు రాష్ట్ర నాయకులే కాక కేంద్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా హాజరవుతారని వరకు తెలిపారు . కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ నియోజకవర్గంలో జరిగే తొలి సభను ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీగా ప్రజలను సభకు వచ్చేటట్లు ఏర్పాట్లు చేసుకోవాలని వారు తెలిపారు . రాష్ట్రంలో దళిత , గిరిజనులకు రక్షణ కల్పించేందుకే ఈ ఆత్మగౌరవ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు బీ ఆర్ఎస్ వారు చేస్తున్న అరాచకాలపై ప్రజలకు తెలియజేసేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పనిచేయాలని వారు పిలుపునిచ్చారు . వారి వెంట మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు శశిధర్ రెడ్డి , డిసిసి అధికార ప్రతినిధి అర్థం రవి , యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కొడీ దల రాము , కాంగ్రెస్ నాయకులు తిమ్మాజిపేట పాండు , ఈశ్వర్ తదితరులు ఉన్నారు .
- January 18, 2023
- Archive
- తెలంగాణ
- NAGARKURNOOL
- తెలంగాణ
- Comments Off on దళిత , గిరిజన ఆత్మగౌర సభ విజయవంతం చేయండి