- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
సీఎం కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పిద్ధామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా గూడపూర్, కల్వలపల్లి, జమస్తానపల్లి, పులిపలుపుల గ్రామాలలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలోని 4కోట్ల మంది ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఉపఎన్నిక అన్నారు. టీఆర్ఎస్ పార్టీ 9 ఏండ్లల్లో రాష్ట్ర ప్రజలకు చేసిందేమిలేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సబ్బండ వర్గాల ప్రజలు, మరెన్నో పోరాటాలు, త్యాగల కోట్లాడి తెచ్చుకున్నట్లు ఆయ తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించే బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బిజెపి నాయకులు పాల్గొన్నారు