Comments Off on టీయూడబ్ల్యూజే హెచ్ 143 మహాసభను జయప్రదం చేద్దాం
రేపు నాగర్ కర్నూల్ లో జరిగే సభకు ఏర్పాట్లు సామాజిక సారథి , నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అబ్దుల్లాఖాన్ యూనియన్ నేతలు జెమిని సురేష్ , చందు నాయక్, దినకర్ రావు, నాగశేషయ్య, శేఖరా చారి,అహ్మదుల్లా ఖాన్. నేషనల్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఎండి. రావుఫ్ ,నాగ శేషయ్య, అచ్చంపేట శీను. చంద్రశేఖర్ రావు, తిప్పర్తి విజయ్ కుమార్ లు తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు న గల రూబీ గార్డెన్ లో సభ ప్రారంభం అవుతుంది అన్నారు. అంతకుముందు ఉయ్యాలవాడ సమీపంలో జర్నలిస్టులకు కేటాయించిన నాలుగు ఎకరాల స్థలంలో జర్నలిస్టు భవన్ కు మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మరి జనార్దన్ రెడ్డి,బీరం హర్షవర్ధన్ రెడ్డి, జయపాల్ యాదవ్. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డిలు పూజ నిర్వహిస్తారని వారు తెలిపారు. అనంతరం పట్టణంలోని రూబీ గార్డెన్స్ లో జరిగే మహాసభలకు వీ రు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగిస్తారని వారు తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లా జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై సభలను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వీరితోపాటు నాయకులు ఉమా శంకర్,పి వెంకటస్వామి, ఖానాపురం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.