- దిమిలిలో వినూత్న జాతర
- వెదురు కర్రలతో కొట్టుకునే పండగ
సామాజిక సారథి, విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని రాంబిల్లి మండలం దిమిలి గ్రామంలో వినూత్న జాతర నిర్వహించారు. పురుషులంతా గుంపులుగా చేరి వెదురు కర్రలతో కొట్టుకునే ఈ జాతరను ప్రతి రెండేళ్ల కొకసారి జరుపుకోవడం ఆనవాయితీ. జాతరలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకుండా కేవలం ఎదురు కర్రలతో కొట్టుకోవడం జాతర ప్రత్యేకత. మూడువందల ఏళ్ల క్రితం మరాఠి దండు దిమిలి గ్రామంపై దండెత్తి దాడులు చేస్తున్న సమయంలో బెల్లమాంబ అనే వీరవనిత మరాఠి దండును ఎదుర్కొందని, అందుకే ఆమె పేరుతో అమ్మవారి జాతరను నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇదే గ్రామంలో బురద పండుగను జరుపుకునేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని కాల్వలో ఉన్న బురదను వేపకొమ్మలతో గ్రామస్తులు పూసుకుని మరో జాతర జరుపుకోనున్నారు.