సారథి న్యూస్, కొల్లాపూర్: ఈనెల 28న కొల్లాపూర్‌లో జరిగే స్వేరోస్ జ్ఞానయుద్ధ భేరి సభను జయప్రదం చేయాలని స్వేరోస్ సీనియర్ రిసోర్స్ పర్సన్ డాక్టర్ సోలపోగుల స్వాములు కోరారు. సోమవారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎన్మన్ బెట్ల, జవాయిపల్లి, సింగోటం కొండ్రావుపల్లి, కల్వకోల్, కుడికిళ్ల గ్రామాల్లో పర్యటించి యువకులు, విద్యార్థులకు జ్ఞాన యుద్ధభేరి సభ ఆవశ్యకత, ప్రాముఖ్యత, ఉద్దేశ్యాన్ని వివరించారు. అనంతరం వారిచేత పోస్టర్లు, కరపత్రాలు, స్టిక్కర్లను విడుదల చేయించారు. అంతకుముందు కొల్లాపూర్ సీఐ వెంకట్ రెడ్డి, పెంట్లవెల్లి ఎస్సై శ్రీనివాస్ తో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు వి.మోహన్, బి కురుమయ్య, ఉసేనమ్మ, కోళ్ల శివకుమార్ పాల్గొన్నారు.
- March 8, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- KOLLAPUR
- RS PRAVEEN
- SWAEROES
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
- కొల్లాపూర్
- జ్ఞానయుద్ధ భేరి
- స్వేరోస్
- Comments Off on ‘జ్ఞానయుద్ధ భేరి’ పోస్టర్ల ఆవిష్కరణ