సారథి న్యూస్, రామయంపేట: అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీరాముడి ఆలయానికి విరాళాల సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే బహిరంగ క్షమాపణ చెప్పాలని నిజాంపేట బీజేపీ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. రాముడి గుడి ఎక్కడ కట్టినా విరాళాలు ఇవ్వడానికి ప్రతి హిందువు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, నరేశ్, మహంకాళి, నరేష్ రెడ్డి, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
శోభాయమానంగా శోభాయాత్ర
అయోధ్యలో రామమందిర నిర్మాణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ నుంచి శ్రీరాముడి శోభాయాత్రను న్యూ బస్టాండ్ వరకు నిర్వహించారు. అలాగే నిజాంపేట మండల కేంద్రంలోని పలు వీధుల్లో శ్రీరామ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీరాముడి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జీపీ స్వామి, బాబు, చంద్రశేఖర్, నవీన్, ప్రశాంత్, శివ తదితరులు పాల్గొన్నారు.