సారథి, చొప్పదండి: కాంగ్రెస్ పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ను దూషించే స్థాయి పాడి కౌశిక్ రెడ్డిది కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తొత్తుగా మారి మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులను రాళ్లతో కొట్టించిన చరిత్ర నీకే ఉందన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్నిన్ను పార్టీలోకి తీసుకొని హుజురాబాద్టికెట్ఇచ్చిందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ కోవర్టుగా ఎన్నో కార్యక్రమాలు చేశావని, నీ అంతట నీవే నీ దొంగబుద్ధి బయటపెట్టుకున్నావని అన్నారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు ముద్దం తిరుపతిగౌడ్, పెరుమండ్ల గంగయ్య, కొట్టే అశోక్, పురం రాజేశం, గుర్రం రమేష్, రాములు, నిజనరపు చందు, కన్నమల్ల రాజశేఖర్, తాండ్ర వేణు, బండారి అఖిల్, ప్రేమ్ కుమార్, సోమిడి శ్రీనివాస్, విజయ్ కుమార్, నెల్లి సంతోష్, శ్రీనివాస్, రాజేందర్, మంగలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు రమేష్, నితిన్, అఖిల్, శంబయ్య, కరుణాకర్, తిరుపతి, రగంపేట గ్రామశాఖ అధ్యక్షుడు భీమయ్య పాల్గొన్నారు.
- July 14, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- huzurabad
- koushikreddy
- TRS
- కౌశిక్ రెడ్డి
- చొప్పదండి
- టీఆర్ఎస్
- హుజురాబాద్
- Comments Off on ‘కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కోవర్టు’