సామాజికసారథి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మండలంలోని నల్లవెల్లిలో కల్లు పంచాయితీ చినికి చినికి గాలివానగా మారింది. కాంట్రాక్టర్ ముందస్తుగా రూ.2లక్షలు ఒప్పుకున్న విధంగా రూ.లక్ష ముట్టజెప్పాడు. మరో రూ.లక్ష ఇవ్వాల్సి ఉంది. తనకు మాముళ్లు ఇవ్వలేదని గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కల్లు అమ్మకాలను బంద్ చేయించాడు. దీంతో రోజువారీగా కల్లుకు అలవాటువాడిన వారు బిత్తరపోతున్నారు. ఇంతలో ఈ విషయం మరో ప్రజాప్రతినిధి దాకా వెళ్లింది. ఆయన తనకు సదరు లీడర్ తో ఉన్న రాజకీయ విబేధాలతో గ్రామంలో కల్లును అమ్మాల్సిందేనని హుకుం జారీచేశాడు. మరో అడుగు ముందుకేసి కాంట్రాక్టర్ కు సపోర్టుగా నిలిచాడు. ‘నీవు కల్లు అటో తీసుకురా.. నీకేమైనా అయితే నేను చూసుకుంటా’ అంటూ కల్లు దుకాణం తెరిపించే ప్రయత్నం చేశాడు. వారి మాట విని కల్లు వాహనం గ్రామానికి పంపితే గ్రామములో రోడ్డు మీద వాహనం నిలిపి , కాంట్రాక్టర్ ఒప్పుకున్న రూ.లక్ష ఇవ్వలేక.. కల్లు దుకాణం తెరవలేక కాంట్రాక్టర్ దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు.
- February 22, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- TELANGANA
- తెలంగాణ
- Comments Off on ఆ ఊరులో కల్లు లొల్లి!