సారథి, వేములవాడ: జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్(143) ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. వేములవాడతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఆయన వెంట ప్రెస్క్లబ్ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఇతర జర్నలిస్టులు ఉన్నారు.
- April 30, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CARONA
- JOURNALIST
- RAJANNA SIRICILLA
- కరోనా
- జర్నలిస్టులు
- ఫ్రంట్ లైన్ వారియర్స్
- వేములవాడ
- Comments Off on జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలి