- కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లేఖ
సామాజికసారథి, కరీంనగర్: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ నాయకుడు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఉపాధ్యాయుల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్న జీవో 317ను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను సొంత జిల్లాల నుంచి బలవంతంగా ఇతర జిల్లాలకు బదిలీ చేయడం అన్యాయమన్నారు. ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 317ను జారీ చేసిందని, కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మరిందన్నారు. సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేలా విడుదల చేసిన జీవోను ప్రభుత్వం ఉప సంహరించు కోవాలని ఆయన డిమాండ్ చేశారు.