Breaking News

యూఆర్ఎస్ స్కూళ్లో స్పెషల్ ఆఫీసర్ ఇష్టారాజ్యం

డీఈఓ1 ఆఫీస్ సిబ్బందితో కలిసి చేతివాటంతనకు అనుకూలంగా ఉండే మహిళకు అకౌంటెంట్ పోస్టు వివరాలు కావాలని అడిగితే సమాధానం దాటవేతపట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు23

సామాజిక సారథి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ ఎదురుగా ఏర్పాటు చేసిన యూఆర్ఎస్ ( అర్భన్ రెసిడెన్షియల్ స్కూల్) స్పెషల్ ఆఫీసర్ జంబులయ్య ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వనపర్తి జిల్లాకు రెగ్యులర్ డీఈఓ లేకపోవడం ఇంచార్జీ డీఈఓ లు పాలన కొనసాగిస్తుండడంతో యూఆర్ఎస్ స్కూల్ పై పర్యవేక్షణ కరువైంది. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా డీఈఓ గోవింద రాజులు వనపర్తి జిల్లాకు డీఈఓ గా వ్యవహరిస్తుండడంతో వనపర్తి జిల్లాలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.వనపర్తి జిల్లా కేంద్రంలోనే జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో యూఆర్ఎస్ స్కూల్ ఎస్ఓ జంబులయ్య ఏకంగా డీఈఓ ఆఫీస్ సిబ్బందితో కుమ్మక్కై బోగస్ లెక్కలు రాసుకుంటూ అందినకాడికి దండుకుంటున్నారు. పైగా ఇక్కడ తానే స్పెషల్ ఆఫీసర్ కావడంతో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని బెదిరింపులకు గురిచేస్తూ తన అవినీతి, అక్రమాలను భయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. యూఆర్ఎస్ స్కూల్ లో తన కుటుంభ సభ్యులనే డే, నైట్ వాచ్ మెన్ లుగా నియమించుకొని బోగస్ లెక్కలు రాసుకుంటూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అకౌంటెంట్ ఉద్యోగం భర్తీ పై అనుమానాలు…ఇటీవల వనపర్తి యూఆర్ఎస్ స్కూల్ లో ముగ్గురు కుకింగ్ స్టాప్, ఒక అకౌంటెంట్ ఉద్యోగం భర్తీ కోసం నోటీఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు స్థానిక యూఆర్ఎస్ స్కూల్ లోనే దరఖాస్తులు స్వీకరించడంతో పాటు మెరిట్ లీస్ట్ ను తయారు చేసి తుది జాబీతా అనుమతి కోసం డీఈఓ కార్యాలయానికి పంపించారు. యూఆర్ఎస్ స్కూల్ లో ప్రతినెల బిల్లులు, ఇతర నిధులు ఖర్చు తదితర కీలకమైన పనులు అకౌంటెంట్ ద్వారానే జరగాల్సీ ఉంటుంది. దీంతో ఇక్కడ అకౌంటెంట్ ఉద్యోగం కోసం వచ్చిన దరఖాస్తులలో మెరిట్ జాబీతాలో ఉన్నవారిని తప్పించి తనకు అనుకూలంగా ఓ మహిళకు అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పించినట్లు ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు మహిళ చిన్నంబావి మండలంలోని కేజీబీవీ లో అటెండర్ గా పనిచేస్తుండగా డీఈఓ ఆఫీస్ లోని సీనియర్ అసిస్టెంట్ విష్ణు, యూఆర్ఎస్ జంబులయ్యలు చక్రం తిప్పి అకౌంటెంట్ పోస్టును అమ్ముకున్నట్లు తెలిసింది. అకౌంటెంట్ గా తనకు అనుకూలంగా ఉన్న మహిళ ఉంటే తాను చెప్పినట్లు బోగస్ లెక్కలు రాస్తుందని వేరే వాళ్లు ఉంటే తనని ప్రశ్నిస్తారని ఆ మహిళకు ఉద్యోగం వచ్చేలా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.సమాచారం ఇవ్వకుండా దాటవేత…వనపర్తి యూఆర్ఎస్ లో ముగ్గురు కుకింగ్ స్టాప్ తో పాటు ఒక అకౌంటెంట్ ఉద్యోగానికి వచ్చిన దరఖాస్తులు ఎన్ని ? ఎవరిని ఉద్యోగాలకు ఎంపిక చేశారన్న సమాచారాన్ని యూఆర్ఎస్ ఎస్ ఓ జంబులయ్యను అడగగా సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్నాడు. తనకు ఏమీ తెలియదని అంతా డీఈఓ ఆఫీస్ వాళ్లకే తెలుసంటూ బుకాయిస్తున్నాడు. తన స్కూళ్లో జరిగిన ఉద్యోగాల భర్తీ నిర్వాకం బయటికి పొక్కడంతో తనకేమి తెలియదని సమాధానం దాటవేస్తున్నాడు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు యూఆర్ఎస్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలపై స్పందిస్తారా..లేక అక్రమార్కులకు అండగా ఉంటారో వేచి చూడాల్సీందే.

  1. ↩︎
  2. ↩︎
  3. ↩︎